కేసీఆర్ అత్యవసర సమావేశాలు.. అందరికీ టెన్షనే ?

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అంతరంగం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని అన్ని రాష్ట్రాలలోను విస్తరించే ప్రయత్నాలు ఒకపక్క చేస్తూనే,  తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

 Kcr's Emergency Meetings Tension For Everyone, Brs, Telangana, Kcr, Kcr Emergenc-TeluguStop.com

బీ ఆర్ ఎస్ ను తెలంగాణలో ఓడిస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఎదుగుదలకు అడ్డుపడవచ్చు అనే వ్యూహంతో కేంద్ర అధికార పార్టీ బిజెపి పావులు కదుపుతూ ఉండడంతో , కేసీఆర్ అలర్ట్ అవుతున్నారు.ఒకవైపు చూస్తే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రజా బలం పెంచుకోవడంతో పాటు,  ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తిరుగులేకుండా చేసుకునేందుకు కేసిఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే  తెలంగాణలోని పార్టీ కీలక నాయకులతో కేసీఆర్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Telugu Congress, Hareesh Rao, Kcr Emergency, Telangana, Vinod-Politics

నిన్ననే మంత్రులు కేసీఆర్ , హరీష్ రావు , ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ , రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు తో పాటు , మరో ముగ్గురు సీనియర్ నాయకులతో కేసీఆర్ అనేక అంశాలపై చర్చించారు.అయితే వాటికి సంబంధించిన వివరాలు ఏవి బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లాలో వైద్య , ఆరోగ్య శాఖ కు చెందిన కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొనాల్సి ఉన్నా.అత్యవసరంగా ప్రగతి భవన్ కు రావాలని హరీష్ కు ఆదేశాలు జారీ చేశారట.

దీంతో ఆయన తన షెడ్యూల్ మొత్తం రద్దు చేసుకుని కెసిఆర్ సమావేశానికి హాజరయ్యారు.

Telugu Congress, Hareesh Rao, Kcr Emergency, Telangana, Vinod-Politics

అయితే కేసీఆర్ ముఖ్య నాయకులందరితోనూ ఏ ఏ అంశాలపై ప్రగతి భవన్ లో చర్చించారనే విషయం బయటకు రాకుండా చూసుకోవడంతో , అక్కడ ఏం జరిగిందని ఆసక్తి రాజకీయ వర్గాలు పెరిగింది.  తొందరలోనే తెలంగాణ ఎన్నికలు ఉండడంతో,  ప్రభుత్వం ఏ ఏ హామీలతో మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలి ? గతంలో ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలయ్యాయా ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారట.   బీమా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం,  దళిత బంధు పథకం వంటి అన్ని అంశాలపై చర్చించినట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అంతేకాదు ఎన్నికలు ఎప్పుడు జరిగిన పార్టీ శ్రేణులు అంత సిద్ధంగా ఉండే విధంగా ఏం చేయాలనే విషయం పైన కీలకంగా చర్చించినట్లు సమాచారం.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ ఉండడం పై పార్టీ వర్గాల తో పాటు, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి , ఆందోళన కలిగిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube