టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఇటీవల మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే.23 రోజులపాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఇటీవల మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి 18వ తేదీన తుదిశ్వాస విడిచారు.20వ తేదీన ఆయన అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే.అయితే తారకరత్న మరణాన్ని అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించులేకపోతున్నారు.
ఆయన మరణం ఇప్పటికీ కలగానే ఉంది అంటున్నారు.ఇకపోతే తాజాగా తారకరత్న చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు.

తాజాగా నిర్వహించిన తారకరత్న చిన్న కర్మ కార్యక్రమంలో నందమూరి కుటుంబసభ్యులు అందరూ పాల్గొన్నారు.తారకరత్న తల్లితండ్రి మోహనకృష్ణ, సీత,చెల్లెలు రూపతో పాటు బాలకృష్ణ ఫ్యామిలీ,రామకృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ, ఇతర కుటుంబ సభ్యులు చిన్న కర్మలో పాల్గొన్నారు.

తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.కుటుంబ సభ్యులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు సైతం తారకరత్న చిన్న కర్మలో పాల్గొన్నారు.తారకరత్న చిన్నకర్మ కార్యక్రమంలో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.పక్కనే ఉండి ఎంతమంది ఓదార్చినప్పటికీ ఆమె తన బాధను కంట్రోల్ చేసుకోలేకపోయింది.భర్త ఫోటోని చూసి వెక్కి వెక్కి ఏడ్చేసింది.

తన భర్త తారకరత్న ఇక లేరు అన్న వార్తను ఆమె జీర్ణించుకోలేకపోతోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఏడుస్తున్న తల్లిని పెద్ద కుమార్తె నిషిక ఓదార్చిన దృశ్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిన చేస్తోంది.
పాటు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోతున్న అలేఖ్యను కుటుంబ సభ్యులంతా ఓదార్చే ప్రయత్నం చేశారు.భర్త చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తూ అలేఖ్య కన్నీటి పర్యంతమయ్యారు.







