సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిన నిజం.ఇలా కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు కాకుండా గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఈ సమస్య ఉందని ఇప్పటికే ఎంతోమంది సీనియర్ నటీమణులు తాము కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు.
అయితే కాస్టింగ్ కౌచ్ కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి ఒక్కరంగంలోనూ కూడా ఉంటుంది.అయితే సినిమా ఇండస్ట్రీలో మరి కాస్త ఎక్కువగా ఉంటుందని, అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం ఎదుర్కోకపోవడం అనేది పూర్తిగా మన ప్రవర్తన పై ఆధారపడి ఉంటుందని ఎంతోమంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేశారు.
ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన సీనియర్ నటి ఆమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె కెరియర్ మొదట్లో తనకు ఎదురైనటువంటి చేదు సంఘటనల గురించి తెలియజేశారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అనంతరం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఇండస్ట్రీలో తాను ఇంత సక్సెస్ కావడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని ఈమె తెలియజేశారు.

ఇండస్ట్రీలోకి రావడానికి తాను ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆడిషన్స్ జరుగుతుంటే ప్రతి ఒక్క కంపెనీకి తాను వెళ్లి ఆడిషన్స్ ఇచ్చేదాన్ని అని తెలిపారు.అయితే కొందరు తర్వాత చెబుతాం అంటూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కాదు.మరికొందరు రిజెక్ట్ చేసేవారు.మరికొందరు ఫోన్ చేసి బీచ్ కి వస్తారా అని అడిగేవారు.మరికొందరు దర్శకుల మేనేజర్లు ఫోన్ చేసి సార్ రమ్మంటున్నారు వస్తారా అని అడగడంతో తనతో పాటు అమ్మ కూడా వస్తుందని చెప్పగా ఒంటరిగా రమ్మని ఫోన్లు కూడా చేసేవారు.అయితే ఇలా ఉంటుందని నాకు తెలియదు.
మరి కొందరు మేనేజర్లు వాళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తున్నారో తెలుసుకోవాలి కదా అంటూ చెప్పడంతో అప్పటినుంచి జాగ్రత్త పడ్డానని అయితే ఇండస్ట్రీలో అందరూ చెడ్డ వాళ్లే కాదు మంచి వాళ్ళు కూడా ఉంటారని ఈ సందర్భంగా తాను కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి ఆమని తెలియజేశారు.







