మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తో మరియు నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా తో ఇటీవలే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సంక్రాంతి కి వీరిద్దరూ పోటీ పడుతున్నారనే ఉద్దేశం తో ఇతర హీరోలు సంక్రాంతి బరి నుండి తప్పుకున్నారు.
సంక్రాంతి కి పోటీ పడ్డ వీరిద్దరూ దసరా కు కూడా పోటీ పడబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దసరా బరి లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా నిలవ బోతున్నట్లుగా సమాచారం అందుతుంది.మొన్నటి వరకు ఆగస్టు నెల లోనే సినిమా ను విడుదల చేయాలని భావించినప్పటికీ షూటింగ్ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయి, అందుకే దసరా కు సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డు చెప్పుకొచ్చారు.

మరో వైపు నందమూరి బాలకృష్ణ సంక్రాంతి కి భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్నాడు.ఆ సినిమా ని మొదటి నుండి కూడా దసరా కి విడుదల చేయాలని భావిస్తున్నాడు.కనుక మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు ఈ ఏడాది ఆరంభం లో సంక్రాంతి కి పోటీ పడ్డారు.
ఇదే ఏడాది చివర్లో దసరా కి కూడా పోటీ పడబోతున్నారు.సినిమా ఇండస్ట్రీకి అత్యంత కీలకమైన సంక్రాంతి మరియు దసరా సీజన్ లలో వీరిద్దరే పోటీ పడితే ఇతర హీరోల పరిస్థితి ఏంటి అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
చిన్న హీరో లకు ఇతర హీరోలకు దసరా లేదా సంక్రాంతి వదిలి పెడితే బాగుంటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.దసరా ని ఈ ఇద్దరు హీరోల్లో ఎవ్వరో ఒకరు వదిలితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.







