మారుతున్న కాల మాన పరిస్ధితులకు అనుగుణంగా విద్యా రంగంలోనూ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఒకప్పుడు మనదేశంలోనే విద్యార్థులు చదువుకుని ఉద్యోగం సంపాదించేవారు.
కానీ ఇప్పుడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది.నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా విదేశాల వైపు మన పిల్లలు పరుగులు పెడుతున్నారు.
అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ వంటి దేశాలకు భారతీయులు చదువుకోవడానికి వెళ్తున్నారు.తొలుత ధనవంతుల పిల్లలు మాత్రమే ఫారిన్‌లో చదువుకునేందుకు వెళ్లేవారు.
రాను రాను మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా బిడ్డలను విదేశాల్లో చదివించేందుకు సిద్ధపడుతున్నారు.
అయితే ఇదంతా నాణేనికి కెనడాకు చెందిన ఒక విద్యా సంస్థ అధ్యయనం ప్రకారం.
విదేశాలలో చదువుకోవడం వల్ల ప్రయోజనాలు వున్నప్పటికీ, చాలా మంది భారతీయ విద్యార్ధులు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉపాధిని కొనుగొనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా విదేశీ డిగ్రీలు , వీసా పరిమితులు తదితర కారణాలు అవరోధాలుగా మారుతున్నాయని ఎం స్క్వేర్ మీడియా పేర్కొంది.కేంద్ర విద్యా శాఖ డేటా ప్రకారం.7,70,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్ధులు 2022లో చదువుకోవడానికి విదేశాలకు వెళ్లారు.

2015 నుంచి 2019 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్ధుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉపాధి పొందగలిగారని భారత ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.ఈ అధ్యయనం ప్రకారం.భారతీయ విద్యార్ధులు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలలో .వారి విదేశీ డిగ్రీలు, డిప్లొమాలకు మన దగ్గర గుర్తింపు లేకపోవడం వంటివి వున్నాయి.యజమానులు తరచుగా స్థానిక అర్హతలు, అనుభవానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు.దీనికి అదనంగా గడిచిన రెండేళ్లుగా కోవిడ్ 19 ఉద్యోగావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల వ్యాపారాలు కుదేలయ్యాయి.

ఇక గతంలో భారతీయులకు ఉన్నత విద్య అంటే.ఆస్ట్రేలియా, అమెరికా, యూకేనే.అయితే ఇప్పుడు ఈ విషయంలోనూ కెనడా ముందుకు దూసుకొస్తోంది.
మెరుగైన అవకాశాల నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు కెనడాను కూడా తమ గమ్యస్థానంగా మార్చుకుంటున్నారు.దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వ గణాంకాలు చూస్తే.
ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా విడుదల చేసిన డేటా ప్రకారం 2,26,450 మంది విద్యార్ధులు 2022లో కెనడాకు వచ్చారు.తద్వారా అంతర్జాతీయ విద్యార్థుల కేటగిరీలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.2022లో కెనడాకు 184 దేశాల నుంచి 5,51,405 మంది అంతర్జాతీయ విద్యార్ధులు వచ్చారు.చైనా (52,165), ఫిలిప్పీన్స్ (23,380) మంది విద్యార్ధులతో మనకంటే వెనుకే వున్నాయి.2021లో 4,44,260 మందికి కెనడాలో చదువుకోవడానికి అనుమతులు వచ్చాయి.ఇది 2019లో (4,00,600) కంటే ఎక్కువ.
ఆ ఏడాది కెనడాకు 6,37,860 మంది అంతర్జాతీయ విద్యార్ధులు వచ్చారు.అయితే కోవిడ్ 19 కారణంగా 2020లో ఈ సంఖ్య తగ్గిపోగా.2021లో 6,17,315కి చేరింది.







