ఢిల్లీ మేయర్ పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ జెండా విజయకేతనం ఎగురవేసింది.ఈ క్రమంలో మేయర్ గా ఆప్ కు చెందిన సభ్యురాలు షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక అయ్యారు.
మేయర్ పీఠం ఆప్ కే దక్కినట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు.
అయితే గత రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో ఆప్, బీజేపీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.
ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించినా మూడు సార్లు విఫలమైంది.దీంతో ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న న్యాయస్థానం నామినేటెడ్ సభ్యులు ఓటు వేయరాదని సూచించిన విషయం తెలిసిందే.







