పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు క్రేజీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.భీమ్లా నాయక్ తర్వాత పవర్ స్టార్ నటించిన మరో సినిమా రిలీజ్ కానేలేదు.
దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈయన నటిస్తున్న ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.
హరిహర వీరమల్లు సినిమాను మధ్యలోనే ఆపేసారు.
ఇంకా 40 రోజుల షూటింగ్ ఉన్న కూడా పవన్ కళ్యాణ్ షూట్ కు బ్రేక్ ఇచ్చాడు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడు.ఇక వీరమల్లు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.
అలాగే సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
ఇంకా ఈయన లైనప్ లో వినోదయం సీతం రీమేక్ కూడా ఉంది అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నప్పటికీ ఇది మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ అనేది రాలేదు.
అయితే ఈ రోజు మేకర్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.వినోదయ సీతం రీమేక్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా.
పవన్ కళ్యాణ్ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు.

ఈ రోజు ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది.మేకర్స్ ఈ సినిమాను షురూ చేసినట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పిక్స్ షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసారు.
ఈ పిక్స్ లో డైరెక్టర్ సముద్రఖని, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు థమన్, త్రివిక్రమ్ సైతం కనిపిస్తున్నారు.దీంతో త్రివిక్రమ్ ఈ సినిమాలో భాగం అయ్యాడని కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఈ అనౌన్స్ మెంట్ లో పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ లుక్స్ లో మరింతగా అదరగొట్టాడు.దీంతో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది.పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి ఈ సినిమాను త్రివిక్రమ్ నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమా స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడంలో కూడా త్రివిక్రమ్ సహకారం అందిస్తున్నట్టు టాక్.
ఇక థమన్ కనిపించడంతో ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఈయన ఫిక్స్ అయినట్టే చెప్పాలి.







