నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ”వీరసింహారెడ్డి”.ఇటీవలే సంక్రాంతి బరిలో ఈ సినిమాతో వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”వీరసింహారెడ్డి”.ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.
అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోయింది.

బాలయ్యకు జోడీగా శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ నటించారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మించారు.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.
అందుకే ఇప్పుడు ఓటిటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీరసింహారెడ్డి ఈ నెల 23 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుంది.బాలకృష్ణ కెరీర్ లోనే పెద్ద సక్సెస్ అందుకున్న ఈ సినిమా 23న సాయంత్రం 6 గంటల నుండి స్ట్రీమింగ్ కానుంది.
కాగా ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ గురించి బాలయ్య నుండి చిన్న వీడియో క్లిప్ వచ్చింది.

వీరసింహారెడ్డి సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కావొద్దు అంటూ ఫ్యాన్స్ ను ఆడియెన్స్ ను కోరారు బాలయ్య.మరి సోషల్ మీడియా వేదికగా బాలయ్య నుండి వచ్చిన ఈ వీడియో బైట్ నెట్టింట వైరల్ అవుతుంది.చూడాలి థియేటర్స్ లో కుమ్మేసిన వీరసింహారెడ్డి ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.







