వైరల్: భారతీయ పెళ్ళిలో చిందులేసిన బెల్జియం వ్యక్తి... షాకైపోతున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో రోజు అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటే.అందులో కొన్ని సరదాగా ఉంటే, మరికొన్నిటిని చూస్తే ఒకింత బాధ కలుగుతుంది.

 Viral Belgian Man Spilled In Indian Wedding Netizens Are Shocked , Indian Weddin-TeluguStop.com

కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యంగానూ, మరికొన్ని వీడియోలు కాస్త విడ్డురంగాను ఉంటాయి.ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూశారంటే చాలా ఆశ్చర్యానికి లోనవుతారు.

భారతీయ పెళ్ళిలో బెల్జియం వ్యక్తి చిందులేమిటి అని ఆశ్చర్యపోతారు.ఇక అతగాడి గ్రేస్ చూస్తే ఎలాంటివారికైనా మతిపోతుంది.

కాబట్టి ఇక్కడ వీడియోని తప్పక చూడండి.

భారత్ వివాహాలు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

సంగీత్‌, బారాత్ అని మనవాళ్ళు దుమ్ముదులిపేస్తారు.తాజాగా ఓ వెడ్డింగ్‌లో బెల్జియం జాతీయుడు దేశీ డ్యాన్స్ మూవ్స్‌తో దుమ్మురేపిన వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోని ఒకసారి గమనిస్తే బెల్జియం వాసి భార‌తీయ డ్యాన్స్ మూమెంట్స్ త‌న‌కు నేర్పాల‌ని అక్క‌డున్న వారిని కోర‌గా వారు కొన్ని మూమెంట్స్ అత‌డితో చేయించ‌డం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

అతడు మీ ఫేవ‌రెట్ డ్యాన్స్ మూమెంట్స్ నాకు నేర్పిస్తారా? అడగడంతో ఇక మనవాళ్ళు రెచ్చిపోయి అతగాడికి నేర్పుతారు.ఇక మనోడు ఊరుకుంటాడా? నేనుకూడా ట్రై చేయనా అంటూ డాన్స్ ఇరగదీస్తాడు.అవును, ఇండియ‌న్ వెడ్డింగ్ అనే టెక్ట్స్‌తో మొదలైన ఈ క్లిప్ ఇపుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

దాంతో మనవాళ్ళు అదిరిపోయే కామెంట్స్ చేస్తున్నారు.ఒకరు బ్ర‌ద‌ర్‌.

భారత్‌కు స్వాగ‌తం.మీ జీవితంలో మీరు బెస్ట్ టైమ్‌ను ఇక్క‌డ గ‌డుపుతార‌ని కామెంట్ చేయ‌గా, మరొకరు డ్యాన్స్ మూమెంట్స్ చక్కగా నేర్చుకోండి.

ఆ తరువాత మీ దేశానికి వెళ్లి వీటిని నేర్పండి… అని కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube