బఘపురాణా నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు వివిధ ప్రాజెక్టులలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిజ్ఞ చేశారు.మొదటి ఎన్నారై, సుఖ్ బ్రార్, గిల్ గ్రామానికి చెందినవారు.సుఖ్ బ్రార్ బఘపురాణాలోని హాస్పిటాలిటీ ప్రాజెక్ట్‌లో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ బ్రాండ్‌లను ప్రదర్శించే షాపింగ్ మాల్, కెనడా ఆధారిత ట్రక్కింగ్ కంపెనీల కోసం డిస్పాచ్ రూమ్‌లను కలిగి ఉంటుంది.

ఇందులో భాగంగా ట్రక్ పంపేవారు మోగా సిటీలో కూర్చొని ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా సరుకు రవాణా డెలివరీలను షెడ్యూల్ చేయవచ్చు.షిప్‌మెంట్‌లు, పార్సెల్‌ల పికప్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన అన్ని అనుమతులను సుఖ్ బ్రార్ ఇప్పటికే పొందారు.

రెండవ ఎన్నారై, కుల్దీప్ శర్మ, రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మాణంలో ఉపయోగించే ఉక్కు తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.శర్మ ప్రాజెక్ట్ గురించి స్థానిక ఎమ్మెల్యే అమృతపాల్ సింగ్ సుఖానంద్ ఇప్పటికే ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో మాట్లాడారు.
త్వరితగతిన అనుమతులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు ప్లాంట్ కోసం 15 ఎకరాల భూమిని అందజేసినట్లు తెలిపారు.ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరో మూడు ఎన్నారై ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.
వీటి ద్వారా భారతదేశంలో అభివృద్ధి కనిపిస్తుంది.వీరిని ఆదర్శంగా తీసుకొని బాగా డబ్బులు ఉన్నా ఎన్నారైలు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుబడును పెడితే బాగుంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.







