నీతి ఆయోగ్ నూతన సీఈవోగా తెలుగు అధికారి నియామకం అయ్యారు.పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో కొత్త సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ క్రమంలో రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
కాగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.2004-2008, 2012-2015 మధ్య ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు.అంతేకాకుండా లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా సేవలను అందించారు.







