శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గడం లేదని బాధపడుతున్నారా..అయితే ఇలా చేయండి..

ప్రస్తుత సమాజంలో చాలామంది చిన్న వయసు నుంచి అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా తగ్గడం లేదని బాధపడుతున్నారు.కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ లో ఉండే మైనాపు లాంటి ఒక పదార్థం.

 Are You Worried That Cholesterol In The Body Is Not Reducing But Do This ,choles-TeluguStop.com

ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ 200 ఎంజి కంటే అధికంగా ఉన్నప్పుడు అదే కొలెస్ట్రాల్ సమస్య అని వైద్యులు చెబుతారు.శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేవి రెండు ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం అధికం అవ్వడం వల్ల రక్తం సరైన మోతాదులో గుండెకు అందదు.దాని మూలంగా స్ట్రోక్, గుండెపోటు లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.రక్త పరీక్ష వలన శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Telugu Alcohol, Bad Cholesterol, Cholesterol, Tips, Heart Attack, Stroke-Telugu

ఆరోగ్యకరమైన ఆహారం, సరైన డైట్ పాటించకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అస్సలు తగ్గవు.దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రాన్స్ఫాట్ అనేది ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రతిదాంట్లో వినియోగించే కొవ్వు.ఇది చాలా ప్రమాదకరమైనది.

ఇలాంటి పరిస్థితులలో సంతృప్తి ట్రాన్స్పోర్ట్ ఉన్న కొవ్వు తీసుకోవద్దు.ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి శరీరక శ్రమ చాలా అవసరం.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ప్రతి రోజు 30 నిమిషాలు నడవాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పై ప్రభావం పడుతుంది.

Telugu Alcohol, Bad Cholesterol, Cholesterol, Tips, Heart Attack, Stroke-Telugu

ప్రతిరోజు కొలెస్ట్రాల్ మందులు తీసుకుంటూ ఆల్కహాల్ తాగితే ఆ మందులు మీ శరీరంపై ఎటువంటి ప్రభావం చూపించవు.కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పరీక్ష చేసిన వైద్యులకు చూపించడం చాలా ముఖ్యం.వైద్యులు ఇచ్చిన మందులను సరైన మోతాదులో సమయానికి తీసుకుంటూ ఉండాలి.కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవాళ్లు కీటో డైట్ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube