మెదక్ కస్టోడియల్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కస్టడీలో ఖదీర్ ఖాన్ మృతిచెందడాన్ని న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది.
ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.
కాగా పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంతోనే ఖదీర్ ఖాన్ చనిపోయాడన్న అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజాసంఘాలు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.
అయితే మృతుడు ఖదీర్ ఖాన్ ను చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.







