సోషల్ మీడియాలో నిత్యం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని చాలా స్పెషల్ గా ఉంటాయి.
అలాంటివి తెగ వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి నెటిజన్లను తెగ కితకితలు పెడుతోంది.
మరీ ముఖ్యంగా పెళ్ళికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న పెళ్లి తాలూక వీడియో మాత్రం నెక్స్ట్ లెవల్ అని చెప్పుకోవాలి.
ఓ వివాహ కార్యక్రమంలో ఇద్దరు యువకులు డ్యాన్స్ చేస్తుండగా.షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఒక యువకుడు నవ్వుతూ డ్యాన్స్ చేస్తూనే మరో యువకుడిపై తన పగను ఎలా తీర్చుకున్నాడో చూసి.నెటిజన్లు అయితే పగలబడి నవ్వుకుంటున్నారు.
ఓ వివాహ వేడుక సందర్బంగా DJ యువకులు చిందులు వేస్తున్నారు.ఈ క్రమంలో ఇద్దరు యువకులు స్టేజి పైకి వచ్చి సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తుంటారు.
చుట్టు పక్కల వున్నవారు వారి డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు.ఇంతలో ఓ యువకుడికి ఉన్నట్టుండి పూనకం వస్తుంది.మనసులో ఏం పగ పెట్టుకున్నాడో తెలీదు గానీ.నవ్వుతూ డ్యాన్స్ చేస్తూనే మరో యువకుడిని ఒక్కసారిగా పైకి ఎత్తుకుని అమాంతం కిందపడేస్తాడు.
దాంతో వాడి ముడ్డి పగిలినంత పని అవుతుంది.

దాంతో ఆ యువకుడు.కొద్ది సేపు కుయ్యో.ముర్రో.
అని బాధపడి, ఎలాగైనా పోటీగా డ్యాన్స్ చేయాలి అనుకొని అలోచించి ఓపిక లేకున్నా మళ్లీ లేచి డ్యాన్స్ చేసేందుకు రెడీ అవుతాడు.అయితే అప్పటికీ పక్కన ఉన్న వ్యక్తికి కోపం మరి తగ్గలేదేమో, మళ్లీ వచ్చి అదే విధంగా ఎత్తుకుని WWEలో ప్రత్యర్థిని కింద పడేట్టు పడేస్తాడు.
దీంతో పక్కన వారంతా షాక్ అయ్యి చూసుకుంటారు.ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.







