టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కు అదే ఆఖరి టోర్నీ.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్ డ్యూటీ ఫ్రీ డబ్ల్యుటీఏ 1000 సిరీస్ ఛాంపియన్షిప్ తో తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ కు గుడ్ బై చెప్తూ రిటైర్మెంట్ అవనుంది.తన రిటైర్మెంట్ పై స్పందిస్తూ.

 This Is The Last Tournament For Tennis Star Sania Mirza Emotional Comments Are-TeluguStop.com

ఈ టోర్నీ తర్వాత పోటీ పడడం, గెలవడం, పోరాటం వల్ల వచ్చే అనుభూతిని చాలా కోల్పోతానని చాలా ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.మ్యాచ్ కోసం కోర్టులో అడుగుపెడుతున్న వేళ ప్రేక్షకుల కేరింతల వల్ల ఎంతో అనుభూతి పొందానని, ఇకనుంచి ఆ అనుభూతుని కోల్పోతున్న అని చెప్పింది.

సమాజంలో ప్రతి ఒక్కరికి నచ్చినట్టు జీవించే స్వేచ్ఛ కల్పించాలని, నిబంధనల పేరుతో ఎదుటివారి స్వేచ్ఛలకు భంగం కలిగించకూడదని తెలిపింది.ఇక తాను తనకు నచ్చినట్టుగానే జీవిస్తానని చెబుతూ ఎవరైనా ఏదైనా పని చేస్తే కీర్తించడమో లేక చెడ్డవాళ్లగా పరిగణించడం ఈ సమాజంలో ఒక పని అయిపోయింది.

Telugu Dubai Duty Wta, Indianboxer, Latest Telugu, Sania Mirza, Athletes, Womens

మహిళా క్రీడాకారులకు మద్దతు ఇవ్వకపోవడం అనేది ప్రతి వర్గంలోనూ ఉంది.మహిళలకు మద్దతు అందించి ఉంటే అన్ని వర్గాల నుంచి చాలామంది అమ్మాయిలు వివిధ ఆటలలో రాణించే వారని తెలిపింది.భారత బాక్సర్ మేరీకొమ్ ను కూడా చాలామంది బాక్సింగ్ వద్దని, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఈ సమాజం ప్రశ్నించింది అని పేర్కొంది.ఇక తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను టెన్నిస్ లో ఇంతలా రాణించానని, తన కుటుంబం చాలా అడ్వాన్స్ గా ఉంటూ తనపై ఎటువంటి వత్తిడి చేయకుండా సపోర్టుగా నిలబడడం వల్లనే తాను సక్సెస్ అయ్యానని తెలిపింది.

సానియా మీర్జా టెన్నిస్ కు గుడ్ బై చెప్పాక క్రికెట్లో మెంటార్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం చేయనుంది.ఆర్ సీ బీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ కు తమ మహిళా జట్టుకు మెంటార్ గా నియమించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube