ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే స్టార్ మా లో బిబి జోడి కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ లో తమ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతోపెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి సదా ఏకంగా ముక్కు అవినాష్ కాళ్లకు నమస్కారం చేయబోయింది.

బీబీ జోడి కార్యక్రమంలో భాగంగా ముక్కు అవినాష్ ఏకంగా హిజ్రా గెటప్ వేసి సమాజంలో ప్రజలు వారికి ఇస్తున్నటువంటి గౌరవం వారు పడుతున్నటువంటి ఇబ్బందులు గురించి డాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఎంతో అద్భుతంగా చేసి చూపించారు.ఈ పర్ఫామెన్స్ చూసిన తర్వాత హిజ్రాలు అంటే సమాజంలో ఇలాంటి భావన ఉందా నిత్యం వీళ్ళు ఇన్ని అవమానాలను ఎదుర్కొంటున్నారనీ అవినాష్ ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ఈ విధంగా అవినాష్ పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉండడంతో తన పర్ఫామెన్స్ పై జడ్జిగా ఉన్నటువంటి సదా స్పందిస్తూ…తాను ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్ తో ఇలాంటి పర్ఫామెన్స్ ఎక్కడా చూడలేదని తెలిపారు.అలాగే హిజ్రాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి చాలా అద్భుతంగా చూపించారని ఈమె అవినాష్ పర్ఫామెన్స్ పై ప్రశంసల కురిపించారు.అలాగే వేదిక మీదకు వెళ్లి ఏకంగా అవినాష్ కాళ్లకు నమస్కారం చేయబోవడంతో అవినాష్ మాత్రం ఆ పని చేయనివ్వలేదు దీంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.







