కన్నీరు పెట్టిస్తున్న తారకరత్న చివరి వీడియో.. నెట్టింట్లో వైరల్?

టాలీవుడ్ యంగ్ హీరో తారకరత్న ఇటీవలె శివరాత్రి శనివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే.దాదాపుగా 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి అలసిపోయి మృత్యువు చేతిలో ఓడిపోయాడు.

 Last Video Of Nandamuri Tarakaratna Is Going Viral On Social Media, Tarakaratna,-TeluguStop.com

తారకరత్నను కాపాడడానికి వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ వారి ఫలితాలు ఫలించలేదు.ఆరోగ్యంగా నవ్వుతూ తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

తాజాగా సోమవారం రోజు అంత్యక్రియలు కూడా ముగిసాయి.

అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు జరిగాయి.ఇక తారకరత్న అంత్యక్రియలకు అభిమానులు కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు భారీగా తరలి వచ్చారు.కాగా నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

అభిమానులు అయితే తారకరత్న చనిపోయాడు అన్న వార్త ఇప్పటికీ కలగానే ఉంది అని అంటున్నారు.తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అభిమానులు ఆయన నటించిన సినిమాలు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తారకరత్నకు సంబంధించిన ఎన్నో కాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తారకరత్నకు సంబంధించిన చివరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో తారకరత్న తన కొడుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తలనీలాలను తీయిస్తున్నారు.ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ ఏడుస్తున్న ఎమోజిని షేర్ చేస్తూ ఐ మిస్ యు అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా తారకరత్న తన కోరిక తీరక ముందే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.వచ్చే ఎన్నికలలో తారకరత్న టిడిపి పార్టీ తరఫున పోటీ చేయాలను కూడా అనుకున్నాడు.

కానీ ఇంతలోనే ఊహించని దారుణం జరిగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube