ఎన్టీఆర్ కు నా పాట నచ్చకపోవడం ఏంటి.. ఆమని షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.నేను 1990 బ్యాచ్ అని ఇంద్రజ, రోజా, రమ్యకృష్ణ ఒకే బ్యాచ్ అని ఆమె తెలిపారు.మేము కలిసి ఈవెంట్లు చేసుకుంటే బాగుంటుందని ఆమని చెప్పుకొచ్చారు.1990 నుంచి 1997 వరకు తాను 50 సినిమాలలో నటించానని ఆమె తెలిపారు.ఒకే ఏడాది 11 సినిమాలలో నటించానని ఆమని పేర్కొన్నారు.

 Aamani Shocking Comments About Ntr Details Here Goes Viral In Social Media , Aam-TeluguStop.com

ఒకే రోజులో మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు.

రేలంగి నరసింహారావు గారు రెస్ట్ లేకుండా వర్క్ చేయవద్దని సూచించారని ఆమని తెలిపారు.కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాన్ని అందుకోని సమయంలో కొత్త ఆఫర్లు రావేమో అని భయమైందని ఆమె కామెంట్లు చేశారు.

నాకు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే పిచ్చి ఎక్కుతుందని ఆమని అన్నారు.

Telugu Aamani, Chiranjeevi, Raghavendra Rao, Ramya Krishna-Movie

రాఘవేంద్రరావు నా విషయంలో ఫ్రూట్స్ వాడలేదని ఆమె తెలిపారు.నాకోసం స్టీల్ బిందె వాడారని ఆమని చెప్పుకొచ్చారు.భీమవరం బుల్లోడా సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చని సాంగ్ కాగా నా సాంగ్ నచ్చకపోవడం ఏంటి అని ఆమె కామెంట్ చేశారు.

బయట అందరికీ ఆ సాంగ్ నచ్చిందని ఆమె తెలిపారు. ఈవీవీ గారు అడగడంతో రెండు సాంగ్స్ లో నేను చేశానని ఆమని వెల్లడించడం గమనార్హం.

Telugu Aamani, Chiranjeevi, Raghavendra Rao, Ramya Krishna-Movie

ఒక ఆర్టిస్ట్ గా అన్నీ చేయాలని ఆమని అన్నారు.రమ్యకృష్ణ అన్ని రకాల పాత్రల్లో చేశారని ఆమని తెలిపారు.చిరంజీవి గారి సినిమాలో నాకు ఆఫర్ వచ్చిందని డైరెక్టర్ మారడంతో ఆ సినిమాలో ఆఫర్ మిస్ అయిందని ఆమె అన్నారు.ఆ సినిమాలో ఛాన్స్ కోసం ఎన్నో అవకాశాలను మిస్ చేసుకున్నానని ఆమని వెల్లడించడం గమనార్హం.

సినిమా సినిమాకు ఆమనికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube