సీతారామం సినిమాతో సత్తా చాటిన బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆ ఒక్క సినిమాతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది.ఇక ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది అమ్మడు.
ఇప్పటికే నాని 30వ సినిమాలో ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.నాని, మృణా ఠాకూర్ కలిసి సినిమా చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటుగా మరో పాన్ ఇండియా సినిమాలో కూడా మృణాల్ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ శంకర్ తో సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్.ఉప్పెనలో హీరోయిన్ పాత్రని ఎంత హైలెట్ చేశాడో తెలిసిందే.ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ పాత్ర స్పెషల్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.ఇది కూడా పాన్ ఇండియా సినిమా కాబట్టి నేషనల్ లెవెల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతుంది మృణాల్ ఠాకూర్.
చరణ్ సినిమాల్లో ఛాన్స్ అంటే ఇక మృణాల్ కి తిరుగు లేదన్నట్టే.తెలుగులో ఆమెకు స్టార్ క్రేజ్ దక్కినట్టే లెక్క.







