తారకరత్న గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.తారకరత్న కారు డ్రైవర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సార్ ఏది తింటే తమకు కూడా అదే పెట్టేవారని ఆయన కామెంట్లు చేశారు.
తారకరత్న దగ్గర గత రెండేళ్ల నుంచి పని చేస్తున్నానని కారు డ్రైవర్ పేర్కొన్నారు.తాను కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.
బెంగళూరులో ఉండే ఒక వ్యక్తి ద్వారా తాను ఇక్కడ చేరానని కారు డ్రైవర్ అన్నారు.నేను తెలుగు నేర్చుకున్నానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు.ఆయన దేవుడులాంటి మనిషి అని సొంత మనిషిలా ఆయన మమ్మల్ని చూసుకున్నారని కారు డ్రైవర్ పేర్కొన్నారు.ఏ కష్టం రాకుండా ఆయన చూసుకునేవారని కారు డ్రైవర్ వెల్లడించారు.
ఏ తప్పు చేసినా ఆయన తిట్టేవారు కాదని కారు డ్రైవర్ అన్నారు.

తారకరత్న పాదయాత్రకు వెళ్లే సమయంలో ఆయనను తీసుకెళ్లింది నేనేనని కారు డ్రైవర్ అన్నారు.తారకరత్న బెంగళూరు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆయనతో పాటు నేను కూడా ఉన్నానని కారు డ్రైవర్ చెప్పుకొచ్చారు.ఆస్పత్రిలో కూడా లోపలికి వెళ్లి చూసేవాళ్లమని ఆయన కామెంట్లు చేశారు.
స్టేబుల్ గా ఉన్నాడని వైద్యులు చెప్పేవారని ఆయన అన్నారు.ఆయన పక్కనే కూర్చుని భోజనం చేసేవాళ్లమని కారు డ్రైవర్ తెలిపారు.

తారకరత్నను చాలా మిస్ అవుతున్నామని ఆయన కామెంట్లు చేశారు.అలాంటి గొప్ప వ్యక్తులు ఉండరని కారు డ్రైవర్ అన్నారు.సార్ గెస్ట్ హౌస్ లో ఉండేవాడినని కారు డ్రైవర్ తెలిపారు.కారు డ్రైవర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొంతసేపటి క్రితం తారకరత్న అంత్యక్రియలు జరిగాయి.తారకరత్న కుటుంబ సభ్యులు ఆయన మరణ వార్తను విని తట్టుకోలేక శోకసంద్రంలో మునిగిపోయారు.







