అగ్రరాజ్యం అమెరికాలో గత కొద్దినెలలుగా పలు మోసాల్లో భారతీయులు అవుతున్నారు.కరోనా తర్వాత ఫెడరల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను దొడ్డిదారిన కొట్టేసేందుకు పలువురు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోతున్నారు.
దురదృష్టవశాత్తూ బాగా చదువుకున్నవారు, పేరున్న డాక్టర్లు కూడా నేరస్తులుగా చట్టం ముందు నిలబడటం బాధాకరం.తాజాగా అగ్రరాజ్యంలో ఇదేరకమైన కేసులో ఓ భారత సంతతి వైద్యుడు పట్టుబడ్డాడు.
అనవసరమైన ప్రిస్క్రిప్షన్‌లు, మోసపూరిత క్లెయిమ్‌లను సమర్పించడం ద్వారా న్యూజెర్సీ రాష్ట్రంతో పాటు స్థానిక హెల్త్‌కేర్ పథకాలను పొందడంతో పాటు, ఇతర బీమా సంస్థలను మోసం చేసినట్లు సదరు వైద్యుడు అంగీకరించాడు.
నిందితుడిని 51 ఏళ్ల సౌరభ్ పటేల్‌గా గుర్తించారు.
నెవార్క్‌లో మెడికల్ క్లినిక్ వున్న అతను గత వారం యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బీ.కుగ్లెర్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరై తన నేరాన్ని అంగీకరించాడు.అప్పటికే సౌరభ్‌పై హెల్త్ కేర్ మోసానికి పాల్పడ్డట్లుగా అభియోగాలు మోపారు ప్రాసిక్యూటర్లు.న్యూజెర్సీలోని వుడ్‌బ్రిడ్జికి చెందిన వ్యక్తి సౌరభ్ పటేల్.ఇతని కుటుంబానికే చెందిన కైవల్ పటేల్‌తో సౌరభ్.హెల్త్ కేర్ మోసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు.
న్యాయస్థానానికి సమర్పించిన పత్రాల ప్రకారం.ఫార్మాస్యూటికల్స్, మెడిసిన్‌లో ఎలాంటి అనుభవం లేనప్పటికీ.కైవల్, అతని భార్య కలిసి ఏబీసీ హెల్తీ లివంగ్ ఎల్ఎల్‌సీ అనే కంపెనీని సృష్టించారు.కాంపౌండ్ ప్రిస్క్రిప్షన్ మందులతో పాటు వైద్య ఉత్పత్తులు, సేవలను మార్కెట్ చేయడం వీరిద్దరూ పనిగా పెట్టుకున్నారు.
ఈ క్రమంలో కైవల్ అతని సహచరులు ఒకరోజున సౌరభ్‌ను కలిసి ప్రిస్క్రిప్షన్ ద్వారా తాము కమీషన్ అందుకున్న కంపెనీల మందులను విక్రయించేలా ఒత్తిడి తీసుకొచ్చారు.అలాగే బీమా కంపెనీలను కూడా మోసం చేసేలా కైవల్ ప్లాన్ చేశాడు.
అ నేరాలకు సంబంధించి కైవల్‌పై మనీలాండరింగ్ సహా పలు అభియోగాలు మోపారు.ఈ ఏడాది చివరిలో అతనిని న్యాయస్థానం విచారించనుంది.ఇక ఈ కుట్రలో కైవల్‌కు సహకరించినందుకు గాను సౌరభ్‌కు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష.2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం వుంది.వచ్చే ఏడాది జూన్ 27న సౌరభ్‌కు శిక్ష ఖరారు చేయనున్నారు.