‘SSMB28’లో ఆ బిటౌన్ బ్యూటీ.. అలాంటి పాత్రలో..

సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.మహేష్ బాబు గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో థియేటర్స్ లో సందడి చేసాడు.

 Bollywood Beauty Bhumi Pednekar In Mahesh Ssmb28 Movie-TeluguStop.com

ఈ సినిమాతో మహేష్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా కూడా ఇంకా మరో సినిమా షూట్ సగం కూడా పూర్తి చేయలేదు.

అందుకే మహేష్ బాబు ఈ గ్యాప్ ను పూర్తి చేయాలని గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాడు.ప్రెజెంట్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ”SSMB28” సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Telugu Bhumi Pednekar, Bhumipednekar, Lady Role, Mahesh Babu, Pooja Hegde, Ssmb,

ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.బాలీవుడ్ బ్యూటీ భూమి ఫేడ్నేకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించ బోతుందట.ఆమె పాత్ర ఈ సినిమా సెకండాఫ్ లో వస్తుందని.అది కూడా లేడీ కానిస్టేబుల్ పాత్ర అని తెలుస్తుంది.మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu Bhumi Pednekar, Bhumipednekar, Lady Role, Mahesh Babu, Pooja Hegde, Ssmb,

ఇక దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో జగపతిబాబు కూడా కీ రోల్ లో నటిస్తున్నాడు.

పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube