టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ ల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇదే విషయం గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ మధ్యకాలంలో అయితే వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి.త్వరలోనే పెళ్లి ప్రకటన కూడా రాబోతుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.
ఆ వార్తలకు అనుగుణంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు రెండు మూడు పార్టీలో కలిసి కనిపించడంతో ఆ వార్తలను నిజమే అని చాలామంది నమ్మారు.

కానీ ఆ వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి అవార్తల్లో నిజం లేదని వాటిని కొట్టి పడేసింది.అంతే కాకుండా వరుణ్ తేజ్ మోస్ట్ హ్యాండ్సమ్ అని హీరో నానితో పోలిస్తే వరుణ్ తేజ్‌నే అందంగా ఉంటాడు అని తెలిపింది లావణ్య.అయితే ప్రస్తుతం ఇది అందరిని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి షాక్‌కి గురి చేస్తుంది.
ఇకపోతే లావణ్య త్రిపాఠి తాజాగా పులిమేక అనే చిత్రంలో నటించింది.తాజాగా ఈ మూవీ టీమ్ సుమ యాంకర్‌గా చేస్తున్న సుమా అడ్డా షోలో పాల్గొన్నారు.
ఇందులో కోన వెంకట్ కూడా పాల్గొన్నారు.అయితే వీరితో సుమ గేమ్‌లు ఆడిస్తూ, ప్రశ్నలు సందిస్తూ, ఆడియెన్స్ తో డైలాగులు చెప్పిస్తూ ఆద్యంతం నవ్వులు పూయించింది.
ఓ కుర్రాడు ఏకంగా లావణ్య త్రిపాటి లాంటి అమ్మాయి కావాలని చెప్పాడు.

అలా అయితే కన్యాశుల్కం ఇవ్వాలని సుమ అనగా, నా జీవితాన్నే ఇచ్చేస్తానని చెప్పడంతో లావణ్య త్రిపాఠి సైతం ఫిదా అయ్యింది.అనంతరం లావణ్య త్రిపాఠిని యాంకర్ సుమ ప్రశ్నిస్తూ .మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరని అడితే మీరు ఎవరి పేరు చెప్తారు అంటూ ఏ నాని, బీ వరుణ్ తేజ్ పేర్లు చెప్పింది సుమ.దీనికి లావణ్య త్రిపాఠి రియాక్ట్ అవుతూ, వరుణ్ తేజ్ పేరు చెప్పింది.వరుణ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని ఆమె తన మనసులోని మాటని చెప్పింది.
దీంతో సుమతోపాటు కోనవెంకట్, సిరిలు కూడా అవాక్కయ్యారు.అలా వరుణ్ తేజ్ తన క్రష్ అని చెప్పకనే చెప్పేసింది లావణ్య త్రిపాఠి.







