తెలుగు అమ్మాయిలా బొట్టు పెట్టుకొని ఫిదా చేసిన ఫరియా అబ్దుల్లా.. చూపులు తిప్పుకోకుండా చేస్తుందిగా?

మామూలుగా ఇతర మతాలకు చెందిన హీరోయిన్లు ట్రెడిషనల్ లుక్కులు కనిపించినా కూడా బొట్టు పెట్టుకోవడానికి అసలు ఇష్టపడరు.కానీ కొంతమంది హీరోయిన్లు అలా కాకుండా.

 Jathi Ratnalu Heroine Faria Abdullah Traditional Look In Yellow Saree,jathi Ratn-TeluguStop.com

బొట్టు పెట్టుకుంటూ అచ్చమైన తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉంటారు.  నిజానికే తెలుగమ్మాయిలు బొట్టు పెట్టుకోకుండా బాగా గ్లామర్ షో చేస్తూ ఉన్నారు.

అటువంటిది ఒక ముస్లిం అమ్మాయి అయినా ఫరియా బొట్టు పెట్టుకొని తెలుగు అమ్మాయిల కనిపించి అందరిని ఫిదా చేసింది.


టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఫరియా.హైట్ లో మాత్రం ప్రభాస్ ని మించి ఉంటుంది ఈ బ్యూటీ.ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఫరియా ఈ సినిమాలో తొలిసారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.


ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో చేసి తన స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు బాగా ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.

బాగా డాన్సులు చేస్తూ వాటిని కూడా పంచుకుంటూ ఉంటుంది.ఇక ఈమెను తన అభిమానులు ముద్దుగా చిట్టి అని లేదా పొడుగు కాళ్ల సుందరి అని పిలుస్తుంటారు.

ఈమె చూడటానికి చాలా పొడవుగా ఉంటుంది.ఇక ఈమె హైట్ విషయంలో బాగా ట్రోల్స్ కూడా ఎదురుకుంది.

ఇక ఫోటో షూట్ లంటూ బాగా రచ్చ చేస్తుంది.ప్రాజెక్టులతో పాటు పలు వేడుకల్లో కూడా బాగా బిజీగా ఉంటుంది.

పైగా షాప్ ఓపెనింగ్స్ లలో కూడా ఈ ముద్దుగుమ్మను బాగా ఆహ్వానిస్తూ ఉంటారు.

అలా అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.ఎల్లో కలర్ డ్రెస్ లో ట్రెడిషనల్ లుక్ లో అందంగా కనిపించింది.

పైగా బొట్టు పెట్టుకొని తెలుగు అమ్మాయిల కనిపించింది.ఇక ఆ ఫోటోలు చూసిన తన ఫాలోవర్స్ బాగా చూపులు తిప్పుకోకుండా.

లైక్స్ కొడుతు తన అందాన్ని పొగుడుతున్నారు.ఒక ముస్లిం అమ్మాయి అయినా కూడా మీరు బొట్టు పెట్టుకొని అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తున్నారు అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube