వైయస్సార్ టిపి పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ నాయక్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఈ క్రమంలో ఆమెను మహబూబాబాద్ నుండి హైదరాబాద్ కీ తరలిస్తున్నారు.ఈ పరిణామంతో షర్మిల పాదయాత్ర ఆగిపోయింది.
శనివారం సాయంత్రం మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.స్థానిక ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు.
దందాలకు పాల్పడుతున్నారని.విమర్శలు చేశారు.

ఈ పరిణామంతో మహబూబాబాద్ లో వైయస్ షర్మిల బస చేస్తున్న ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులు.కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు.కార్యకర్తలు షర్మిల పార్టీ ఫ్లెక్సీలు మరియు కటౌట్లను చింపేయడం జరిగింది.షర్మిల చేసిన వ్యాఖ్యలపై ధర్నాకు దిగారు.ఆ తర్వాత పోలీసులకు బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేయడంతో షర్మిలను అరెస్టు చేయడం జరిగింది.







