టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్, రైట్ వింగర్స్ దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ గతంలో తాను గుళ్ళు గోపురాలు తిరుగుతూ పూర్తి ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపానని తెలిపారు.
తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించి చర్చికి కూడా వెళ్లినట్లు తెలిపారు.అయితే అవన్నీ చూసిన తరువాత స్వలాభం కోసమే మతం అన్న విషయం అర్థమైంది.
అప్పుడు మా కజిన్ ద్వారా అయాన్ రాండ్ ది ఫౌంటెన్ హెడ్, అట్లాస్ ప్రగ్డ్ చదివాను వాటి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాను అని తెలిపారు రాజమౌళి.అప్పటినుంచి మతానికి తాను దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు.

అలాగే మన ఇతిహాసాలైనా రామాయణం మహాభారతం పై ప్రేమను ఏమాత్రం కోల్పోలేదని, వాటిని మత విశ్వాసాల కోణం నుంచి చూడటం మానేసి గొప్ప కథలుగా ఆవిష్కరించిన తీరును గొప్పగా అర్థం చేసుకున్నాను అని చెప్పుకొచ్చారు రాజమౌళి.అలాగే తన ఎదురుకున్న పరిస్థితులలో మతం అనేది ఒక దోపిడీలా ఉంది అని రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అప్పటి నుంచి ఒక వర్గం వారు సోషల్ మీడియాలో రాజమౌళి పై ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు.అయితే రైట్ వింగర్స్ రాజమౌళి పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేయడంతో కంగనా బరిలోకి దిగింది.

ఎప్పుడూ కూడా రైట్ వింగర్స్ కి మద్దతుగా ట్వీట్లు చేసే కంగనా మొదటిసారి వారిపై మండిపడింది.రాజమౌళి వాక్యాలను పూర్తిగా సమర్థించిన కంగనా రాజమౌళి వాఖ్యలపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదని, భక్తులం అయినంత మాత్రాన ప్రతి చోటకి దేవుడు జెండాను మూసుకుంటూ వెళ్లలేము కదా అని తెలిపింది.అలాగే ఈ విషయంలో రైట్ వింగర్స్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ రాజమౌళిని ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యం అంటూ వారిపై మండిపడింది.
ఒక హిందువుని అని చెప్పుకునేందుకు తాను గర్విస్తానని, కానీ ఇప్పుడు తాను చెప్పబోయేది అన్ని రకాలుగా దాడులు చేసే వారికి విద్వేశం వెదజల్లే వారికి ట్రోలింగ్స్ చేసే వారికి వర్తిస్తుంది అని ఆమె ఘాటుగా స్పందించింది కంగనా.







