సినీ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీగా పేరున్న నందమూరి వంశం నుంచి ఎవరైనా ఒకరు హీరోగా ఇండస్ట్రీలోకి ఆరంగేట్రం చేయడం చాలా సులభం అని భావిస్తారు.కానీ నందమూరి తారకరత్న విషయంలో అలా జరగలేదు.
ఆయన ఎంట్రీనే మరొక నందమూరి హీరోకు పోటీగా జరిగింది.ఆ మరొక నందమూరి హీరో ఎవరో కాదు జూ.ఎన్టీఆర్.తారకరత్న జూ.ఎన్టీఆర్ కంటే మూడు నెలలు పెద్దవాడు.అయినప్పటికి జూ.ఎన్టీఆర్ ఇండస్ట్రీకి మొదట పరిచయం అయ్యాడు.2001 లో రిలీజ్ అయిన నిన్ను చూడాలని సినిమాతో తారక్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు.అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ను నందమూరి వంశం కాస్త దూరంలో దూరంలో పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.
అసలు జూ.ఎన్టీఆర్ తమకు సంబంధమే లేదు అన్నట్లుగా వ్యవహరిచేవారట నందమూరి కుటుంబసభ్యులు.కానీ నందమూరి హీరోగా ఎంట్రీ ఇచ్చారు జూ.ఎన్టీఆర్ ఇది నందమూరి కుటుంబ సభ్యులకు అసలు నచ్చేది కాదట.దాంతో జూ.ఎన్టీఆర్ కు పోటీగా నందమూరి వంశం నుంచి తారకరత్న ను హీరోగా పరిచయం చేయాలని భావించారు ఆయన తండ్రి మోహనకృష్ణ.అదే సమయంలో జూ.తన రెండవ సినిమా ” స్టూడెంట్ నెంబర్ ఒన్ “ మూవీని కూడా పూర్తి చేసే సూపర్ హిట్ కొట్టారు.దీంతో తారకరత్నను త్వరగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించిన నందమూరి ఫ్యామిలీ దర్శకుడు రాఘవేంద్రరావును అప్రోచ్ కాగా ఆయన మూవీకి కథ అందిస్తానని హామీ ఇచ్చారు.
ఆ విధంగా రాఘవేంద్రరావు కథతో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ” ఒకటో నెంబర్ కుర్రాడు ” మూవీతో 2002 లో తారకరత్న ఎంట్రీ ఇచ్చారు.మొదట ఈ సినిమాకు నెంబర్ ఒన్ స్టూడెంట్ అనే పేరు అనుకోగా.అది జూ.ఎన్టీఆర్ ” స్టూడెంట్ నెంబర్ ఒన్ “ మూవీకి సిమిలర్ గా ఉంటుందని భావించి. ” ఒకటో నెంబర్ కుర్రాడు “ గా మార్చారు.ఈ మూవీ సాంగ్స్ పరంగా సూపర్ హిట్ గా కాగా ఓవరాల్ గా యావరేజ్ మూవీగా నిలిచింది.
ఒకవైపు స్టూడెంట్ నెంబర్ ఒన్ మూవీతో నటనలో తారక్ మంచి పేరు తెచ్చుకోగా.తారకరత్న మాత్రం నటనలో ఇంకా మెరుగుపడాలనే విమర్శ వినిపించింది.ఇక ఆ తర్వాత యువరత్న, తారక్ వంటి సినిమాలతో యువరత్న ఫ్లాప్స్ చవిచూడగా.జూ.ఎన్టీఆర్ మాత్రం సుబ్బు తో యావరేజ్ హిట్ అందుకున్నప్పటికి ఆ తరువాత వచ్చిన ఆది మూవీతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు.ఆ విధంగా ఒకే వంశం నుంచి వచ్చిన తారకరత్న, జూ.ఎన్టీఆర్ ల మద్య సినిమాల పరంగా వారసత్వ పోరు నడిచిందనేది అందరు కాదనలేని సత్యం.