ప్రముఖ నటుడు తారకరత్న గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

నందమూరి హీరో తారకరత్న మరణ వార్త విని ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.39 సంవత్సరాల వయస్సులోనే నందమూరి తారకరత్న మృతి చెందడం ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.నందమూరి తారకరత్న ఒకే సమయంలో 9 సినిమాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లోకి వచ్చిన తారకరత్న తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

 Shocking Facts Behind Nandamuri Tarakaratna Details, Nandamuri Tarakaratna, Nand-TeluguStop.com

కెరీర్ తొలినాళ్లలో హీరోగా నటించిన తారకరత్న తర్వాత రోజుల్లో విలన్ గా నటించి మెప్పించారు.అమరావతి సినిమాలో తారకరత్న నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించగా ఆ పాత్ర అతనికి మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు విలన్ గా తారకరత్న నంది అవార్డ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా తారకరత్న కెరీర్ మొదలైంది.

Telugu Alekhya Reddy, Amaravati, Nandamurimohana-Movie

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకున్నా ఈ సినిమా తర్వాత తారకరత్న నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.15 కంటే ఎక్కువ సినిమాలలో తారకరత్న హీరోగా నటించడం గమనార్హం.నందమూరి మోహనకృష్ణ కుమారుడు అయిన తారకరత్నకు నందమూరి ఫ్యాన్స్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తారకరత్న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించిన సమయంలో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు.

Telugu Alekhya Reddy, Amaravati, Nandamurimohana-Movie

తారకరత్న భార్య పేరు అలేఖ్యా రెడ్డి కాగా ఆమె పలు సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేశారు.నందీశ్వరుడు సినిమా షూట్ సమయంలో తారకరత్నకు అలేఖ్యారెడ్డితో వివాహం జరిగింది.గతంలో తారకరత్న టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసి ఆ పార్టీ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డారు.కొన్ని నెలల క్రితం తారకరత్న 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించగా ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube