తెగుళ్ళ నుండి మినుము పంటను సంరక్షించే పద్ధతులు..!

మినుము పంటలకు తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.ఇంకా రసం పీల్చే పురుగులు కూడా మినుము పంటను తీవ్రంగా నాశనం చేస్తాయి.

 Pests Prevention In Black Gram Cultivation,black Gram Cultivation,black Gram,pes-TeluguStop.com

మొదటి నుండి కొన్ని సస్యరక్షణ పద్ధతులు క్రమం తప్పక పాటిస్తే మినుము పంటలో మంచి దిగుబడి పొందవచ్చు.మినుము పంట వేసేటప్పుడు ముందుగా విత్తనాలను శుద్ధి చేసుకోవాలి.

ఐదు మిల్లీ లీటర్ల ఇమిడా క్లోప్రేడ్ 600 ఎఫ్.ఎస్ ఒక ఎకరం వేసే విత్తనాలకు అవసరం అవుతుంది.ఈ రసాయన మందుతో విత్తన శుద్ధి చేసుకుంటే రసం పీల్చే పురుగుల బెడద ఉండదు.

Telugu Agriculture, Black Gram, Crop, Weeds-Latest News - Telugu

ఇంకా పొలం చుట్టుపక్కల గట్లపై కలుపు మొక్కలు గడ్డి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ఇలా చేస్తే పల్లాకు తెగులు సోకకుండా ఉంటుంది.ఇక పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి.

ఏవైనా మొక్కలకు పల్లాకు తెగులు సొకడం ప్రారంభమైతే వాటిని వెంటనే తొలగించాలి.పంట వేసిన 15 నుండి 20 రోజుల మధ్యలో ఐదు మిల్లీలీటర్ల వేప నూనెను ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలపై బాగా పడేలా పిచ్చికారి చేయాలి.

ఇలా చేస్తే తెల్ల దోమ దరిచేరదు.ఒకవేళ తెల్ల దోమ ఎక్కువగా వ్యాపిస్తే ఆలస్యం చేయకుండా ఎసిఫేట్ 1.5 గ్రాములు, పిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు, అసిటామిక్ ప్రిడ్ 0.2 గ్రాములు, ఏదో ఒక దానిని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Telugu Agriculture, Black Gram, Crop, Weeds-Latest News - Telugu

ఇక తామర పురుగుల ద్వారా ఆకుముడత తెగులు పంటను నాశనం చేస్తాయి.ఆకుల అంచులు ముడుచుకొని ఎండి రాలిపోతాయి.ఆకు అడుగుభాగం ఎర్రగా ఉంటుంది.

ముందుగా ఇటువంటి మొక్కలను పీకేసి కాల్చడం ద్వారా వైరస్ అనేది ఇతర మొక్కలకు వ్యాపించదు.పొలంలో గ్రీజు పూసిన నీలం రంగు అట్టలను లేదా డబ్బులను మొక్కల కంటే ఒక అడుగు పై భాగంలో అక్కడక్కడ అమర్చాలి.ఇక పిప్రో నిల్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు, ఒక ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

ఇక మొక్కల ఆకులపై చిన్న చిన్న గుండ్రటి మచ్చలు ఏర్పడితే వాటిని ఆకుమచ్చ తెగులు అని నిర్ధారించుకోవాలి.వీటి నివారణ కోసం ప్రోపి కొనజొల్ 1.0 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలుపుకొని 10 నుండి 15 రోజుల మధ్యలో పిచికారి చేసుకోవాలి.పై పద్ధతులను క్రమం తప్పక పాటిస్తే మినుము పంటలో అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube