వైయస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి రెండోసారి సీబీఐ నోటీసులు..!!

2019 ఎన్నికల సమయంలో వైయస్ వివేకనంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ హత్య కేసును సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేస్తూ ఉంది.

 Cbi Notices Second Time To Kadapa Mp Avinash Reddy In Ys Viveka Murder Case Kada-TeluguStop.com

ఈ కేసుకు సంబంధించి చాలా మందిని ఇప్పటికే సీబీఐ విచారించడం జరిగింది.ఈ కేసుకు సంబంధించి గత నెల జనవరి 28వ తారీకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి.

సీబీఐ విచారణకు హాజరయ్యారు.దాదాపు నాలుగు గంటలకు పైగా విచారించడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వైయస్ అవినాష్ రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది.

Telugu Kadapa, Kadapamp, Ys Viveka-Telugu Political News

ఈనెల 24వ తారీకు హైదరాబాదు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వాట్సప్ ద్వారా సీబీఐ నోటీసులు పంపింది.మొదటినుండి ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది.ప్రతిపక్షాలు సైతం ఈ విషయంపై మీడియా సమక్షంలో  అనేకమంది కామెంట్లు చేయడం జరిగింది.

ఈ క్రమంలో వైయస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికీ సీబీఐ రెండోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube