జగనన్న" షూట్ ఔట్ రౌండ్ " .!

సాధారణంగా సూట్ ఔట్ రౌండ్ అనేది గెలుపోటములను నిర్ణయించే చివరి ప్రయత్నంగా చూస్తుంటాము.ఇప్పుడు దీన్నే రాజకీయాలకు ఆపాదించుకుంటే ఏపీలో సి‌ఎం జగన్ కూడా షూట్ ఔట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాడా ? అంటే అవునని మీడియా కొడైకుస్తోంది.అయితే జగన్ చేస్తున్న షూట్ ఔట్ రౌండ్ తన మంత్రివర్గంలోనట.ఇప్పటికే తన మంత్రి వర్గంలో రెండు సార్లు మంత్రులను మార్చిన సి‌ఎం జగన్.మూడవసారి కూడా మార్చేందుకు సిద్దమౌతున్నారనే వార్తలు ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది.

 Jagananna shoot Out Round .! , Shoot Out Round, Jagananna , Gudivada Amarnath, R-TeluguStop.com
Telugu Ap-Politics

తొలిసారి మంత్రివర్గ విస్తరణలో 5మంది ఉపముఖ్యమంత్రులతో కలిపి 25 మందికి స్థానం కల్పించారు.రెండున్నర ఏళ్ల తరువాత మంత్రి వర్గ మార్పు ఉంటుందని ముందే ప్రకటించిన జగన్.అన్నట్లుగానే గత ఏడాది మంత్రి వర్గంలో మార్పు చేశారు.

విధి నిర్వహణలో మంచి నైపుణ్యం కనబరిచిన 11 మంత్రులను అలాగే ఉంచి 26 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు.ఇక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో ఇంకెలాంటి మార్పులు ఉండబోవని భావించరంతా.

అయితే అయిదుగురు మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన జగన్ వారిని మార్చే ఆలోచనలో ఉన్నారట.అలాగే కొనసాగిస్తే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని అందుకే ఆ అయిదుమంది మంత్రులను మార్చాలని సి‌ఎం జగన్ డిసైడ్ అయినట్లు కథనాలు వస్తున్నాయి.

Telugu Ap-Politics

అయితే ఆ అయిదు మంది మంత్రులు ఎవరనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.గత కొన్ని రోజులుగా గుడివాడ అమర్నాథ్, మరియు ఆర్కే రోజా అటు ప్రత్యర్థి నేతల నుంచి ఇటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఐటీ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నా గుడివాడ అమర్నాథ్ పై ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.ఇక రోజా పై కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది.

దీంతో జగన్ వీరిద్దరిని మంత్రివర్గం నుంచి తీసెసే ఆలోచనలో ఉన్నారట.వీరితో పాటుగా మరో ముగ్గురు కూడా సి‌ఎం జగన్ లిస్ట్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న సి‌ఎం జగన్.తన లక్ష్యానికి ఆటంకం కలిగించే ఏ చిన్న పనైనా సీరియస్ గానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గడపగడపకు మన ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహించిన ఎమ్మెల్యేలకు ఎప్పటికే గట్టి వార్నింగ్ లు ఇచ్చిన జగన్.ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మంత్రులాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube