నేడు దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే సాధారణ భక్తులతో పాటు సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున శివాలయాలను సందర్శించి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.
అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు అభిమానులకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇలా భక్తులతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.
పలువురు సెలబ్రిటీలు సైతం శివాలయాలను సందర్శించి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ శైవ క్షేత్రం అయినటువంటి శ్రీశైలానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.అలాగే సినీ సెలబ్రిటీలు సైతం శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుంటున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ తన పెద్ద కుమార్తె సుస్మిత మరియు ఇతర కుటుంబ సభ్యులు సైతం శివయ్య దర్శనం నిమిత్తం శ్రీశైలం వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సురేఖ సుస్మిత ప్రత్యేక దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని ఆలయం వెలుపల సందడి చేశారు.ఈ క్రమంలోనే సుస్మిత ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సుస్మిత విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే గోల్డెన్ బాక్స్ నిర్మాణ సంస్థను స్థాపించి ఈమె నిర్మాతగా కూడా మారారు ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించిన సుస్మిత తాజాగా సంతోష్ శోభన్ హీరోగా శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాని తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.