తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా మొదటిసారి పూర్తిస్థాయి తెలుగులో నటించిన చిత్రం సార్.వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
విద్యా వ్యవస్థ మీద ఒక లెక్చరర్ చేసే పోరాట కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.చదువు పేరుతో కార్పొరేట్ సంస్థలు చేస్తున్న దోపిడీని ప్రశ్నించే లెక్చరర్ పాత్రలో ధనుష్ ఈ సినిమాలో మనకు కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాలో ధనుష్ కి జోడిగా నటి సంయుక్త మీనన్ సందడి చేశారు.
ఇలా సార్ సినిమా కమర్షియల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.చదువు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ చిత్రాన్ని ఉచితంగ ప్రదర్శించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట ఈ సినిమా విద్యార్థులు చదువుకు సంబంధించినది కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ సినిమాని ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనలో ఈ సినిమా మేకర్ ఉన్నట్టు సమాచారం./br>
ఇకపోతే ఈ అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని ప్రవేట్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు కాకుండా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లు,విద్యార్థులకు మాత్రమే ఈ సినిమాని ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించాలని దిశగా మేకర్స్ ఆలోచనలు చేస్తున్నారట.అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన కూడా తెలియజేయనున్నట్లు సమాచారం.ఇదే కనుక నిజమైతే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు టీచర్లు సార్ సినిమాని ఫ్రీగా చూసే అవకాశాన్ని పొందవచ్చు.