చాలా మంది స్టార్ హీరోలు సినిమాల్లో హీరోలుగా చాలా కాలం పాటు కొనసాగిన తర్వాత హీరోలు గా అవకాశాలు తగ్గిపోగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాల్లో వరసగా అవే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు.దీని వల్ల వాళ్ళకి ఇష్టమైన సినిమా ఇండస్ట్రీ లోనే ఉంటూ ఇష్టమైన పనినే చేసుకుంటూ ఉంటున్నాం అనే తృప్తితో చివరి వరకు ఇలా కొనసాగిస్తూ ఉంటారు.
అలా చాలా మంది సినిమా ఇండస్ట్రీ లో హీరోలుగా క్రేజ్ తగ్గగానే క్యారెక్టర్ ఆర్టిస్టులు గా మారిపోయారు.

అయితే ఒక్కప్పటి స్టార్ హీరో అయిన శోభన్ బాబు మాత్రం అలా చేయలేదు ఒక్క సారి సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు అంటే ఎన్ని ఆఫర్స్ వచ్చిన ఇక అసలు సినిమాల్లోనే చేయలేదు…అసలు విషయం ఏంటంటే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అతడు సినిమాలో మహేష్ బాబు తాత క్యారెక్టర్ కోసం త్రివిక్రమ్ శోభన్ బాబుని అడిగారట ఆయన మాత్రం నేను చేయలేను అని చెప్పారట ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన మురళి మోహన్ కూడా అడిగిన నేను అసలు చెయ్యను అని చెప్పాడట

ఇండస్ట్రీ లో మొదటి నుంచే మురళి మోహన్ కి శోభన్ బాబు కి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఆయన అడిగిన చేయను అన్నారంటే ఇక ఆయన చేయరు అని త్రివిక్రమ్ కూడా అనుకొని ఆ పాత్ర కోసం నాజర్ ని తీసుకున్నారు.అయితే ఈ సినిమాలో తాత పాత్ర కి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆయన చేస్తే బాగుంటుంది అని మూవీ టీమ్ అనుకున్న అది మిస్ అయింది నాజర్ కూడా ఈ పాత్ర కి ప్రాణం పోసారనే చెప్పవచ్చు…
.







