ధనుష్ సార్ ఆల్రెడీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విద్యా వ్యవస్థలోని లోటు పాట్ల నేపథ్యంతో వెంకీ అట్లూరి ఒక సీరియస్ సబ్జెక్ట్ తో సార్ సినిమా తెరకెక్కించాడు.
స్క్రీన్ ప్లే కొద్దిగా రొటీన్ అనిపించినా సార్ రేసులో నిలిచినట్టే అనిపిస్తుంది.ఇక శనివారం శివరాత్రి సందర్భంగా కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ అవుతుంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ సినిమా కాబట్టి సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది.
కిరణ్ అబ్బవరం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.
మరి విష్ణు కథ ధనుష్ సార్ తో పోటీ పడగలడా.సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.శివరాత్రి సందర్భంగా వస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే కాదు యూత్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది.
మరి సార్ ముందు కిరణ్ అబ్బవరం సినిమా నెగ్గుతుందా లేదా రెండు సినిమాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయా అన్నది తెలియాల్సి ఉంది.రెండిటికీ పాజిటివ్ టాక్ వస్తే రెండు సినిమాలకు మంచి ఛాన్స్ ఉంది.