యుద్ధంతో జీవితాలు ఛిద్రం : ఉక్రెయిన్ వాసులకు సంఘీభావం.. ఐర్లాండ్‌లోని భారతీయ కమ్యూనిటీ హరిత యజ్ఞం

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్రకు ఆ దేశం చివురుటాకులా వణుకుతోంది.ఎక్కడ చూసినా మరణించిన సైనికుల మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలు, శిథిల భవనాలతో ఉక్రెయిన్ .

 Indian Origin Activists To Plant 10000 Trees For War-torn Ukraine Details, India-TeluguStop.com

స్మశానంలా కనిపిస్తోంది.దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దేశ వాసులు ఐరోపా, తదితర దేశాలకు వలస వెళ్తున్నారు.

కన్నవారిని, పుట్టిన గ్రామాన్ని, అయిన వారిని అందరిని విడిచిపెట్టి.పరాయి దేశంలోనైనా ప్రాణాలతో వుంటే చాలని ఎలాగోలా దేశం విడిచిపోతున్నారు.

మరోవైపు యుద్ధం కారణంగా అతలాకుతలమైన ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం, పలు స్వచ్చంధ సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి.

ఇదిలావుండగా.

సిక్కు సంతతికి చెందిన ఐరీష్ పర్యావరణ కార్యకర్తలు యుద్ధంలో నాశనమై శరణార్థులుగా వివిధ దేశాలకు వెళ్లిపోయిన ఉక్రెయిన్ వాసులకు సంఘీభావంగా ఐర్లాండ్‌లో హరిత యజ్ఞం మొదలుపెట్టారు.దీనిలో భాగంగా ఏకంగా అడవినే నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

EcoSikh Ireland , Reforest Nation సంస్థలకు చెందిన కార్యకర్తలు.ఐర్లాండ్‌లో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

విక్లో కౌంటీలోని గ్రేస్టోన్స్‌లో 10,000 మొక్కలను నాటనున్నట్లు డబ్లిన్ లైవ్ పత్రిక నివేదించింది.

Telugu Dublin, Ecosikh Ireland, Indian Origin, Ireland, Trees, Reest, Russia, Sa

ఐర్లాండ్‌లోని శరణార్థుల సంఘం సభ్యుల సమక్షంలో వారం రోజుల పాటు చెట్లు నాటే కార్యక్రమాలు మొదలుకానున్నాయి.శనివారం నుంచి ఇవి ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.ఎకోసిఖ్ ఐర్లాండ్ ప్రాజెక్ట్ మేనేజర్ సత్వీందర్ సింగ్ డబ్లిన్ లైవ్‌తో మాట్లాడుతూ.

స్వచ్ఛమైన గాలిలో చెట్లను నాటడం వల్ల జీవితాలు అస్తవ్యస్తంగా వున్న వారికి చికిత్స చేసిన అనుభవం వుంటుందన్నారు.

Telugu Dublin, Ecosikh Ireland, Indian Origin, Ireland, Trees, Reest, Russia, Sa

ఈ కృత్రిమ అడవిలో జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఓక్, విల్లో, హాజెల్, చెర్రీ సహా 17 రకాల చెట్లను నాటనున్నారు.చెట్ల పెంపకానికి మద్ధతు ఇవ్వడంతో పాటు శరణార్ధులు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి సహాయపడే కార్యక్రమాలకు నిధులను సమీకరించనున్నారు.

ఇకపోతే.

ఫిబ్రవరి 24కి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తి కానుంది.దీని వల్ల రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుష్పరిణామాలు ఏర్పడ్డాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత ఘోరమైన శరణార్ధుల సంక్షోభానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దారి తీసింది.పలు నివేదికల ప్రకారం.

దాదాపు 8 మిలియన్లకు పైగా ఉక్రేనియన్లు దేశం నుంచి పారిపోయారు.వీరంతా యూరప్, ఉత్తర అమెరికాలలో శరణార్ధులుగా జీవితం గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube