స్టార్ హీరో అల్లు అర్జున్ కు ప్రస్తుతం అదృష్టం ఊహించని రేంజ్ లో కలిసొస్తుండటం గమనార్హం.అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలతో రెండు ఇండస్ట్రీ హిట్లు బన్నీ ఖాతాలో చేరాయి.
ఈ మధ్య కాలంలో బన్నీలా బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు సాధించిన హీరోలు దాదాపుగా లేరనే చెప్పాలి.అల వైకుంఠపురములో సినిమా 175కు పైగా సెంటర్లలో షిఫ్ట్ పద్ధతిలో 50 కంటే ఎక్కువ రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది.
వాల్తేరు వీరయ్య సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య ఇప్పటికీ రికార్డు స్థాయిలో థియేటర్లలో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం.ప్రస్తుతం 300 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం అవుతోందని సమాచారం అందుతోంది.ఇతర జిల్లాలలో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తుండటం గమనార్హం.

శివరాత్రికి విడుదలైన సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోకపోతే వాల్తేరు వీరయ్య సినిమా హవా మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.ఈ నెల 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.అయినప్పటికీ వాల్తేరు వీరయ్య కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

వాల్తేరు వీరయ్య రొటీన్ కథతోనే తెరకెక్కినా ప్రేక్షకులను మాత్రం అంచనాలను మించి మెప్పించిన సంగతి తెలిసిందే.చిరంజీవి అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది.వరుస సినిమాలతో చిరంజీవి బిజీగా ఉండగా ఆ సినిమాలు కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయేమో చూడాల్సి ఉంది.







