ప్రపంచమంతా టెక్నాలజీ మయం అయిపోతోంది.మనిషి ఊహకే అందనంత శాస్త్ర సాంకేతికత ఇపుడు అందుబాటులో వుంది.
పది మనుషులు చేయవలసిన పని ఇపుడు కంప్యూటర్స్ క్షణాల్లో చేసి చూపెడుతున్నాయి.మెటావర్స్ అంటే కూడా ఇదే.వర్చువల్ ప్రపంచంలో విహరించే అవకాశాన్ని మనిషికి కల్పిస్తుంది.ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగించుకొనే దుబాయ్ లో మొట్టమొదటి వర్చువల్ మాల్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.‘ది మాల్ ఆఫ్ ది మెటావర్స్‘గా పిలిచే ఈ వాణిజ్య కేంద్రం మసీజ్ అల్ ఫుట్టయిమ్ డీసెంట్రల్యాండ్ ని రిప్రజెంట్ చేస్తుంది.

కాగా దీనిపైన ప్రస్తుతం అనేక పరీక్షలు జరుపుతున్నారు.ఈ పరీక్షలుగాని విజయవంతం అయితే వినియోగదారులకు ఈ మాల్ ఆఫ్ ది మెటావర్స్ అందుబాటులోకి రానుంది.ఇది రిటైల్, ఎంటర్టైన్మెంట్ రంగంలో అధికమైన డిజిటల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం ఈ మాల్ నిర్మాణం ప్రాథమిక దశలో ఉందని, అవకాశం ఉన్నంత వరకూ వినియోగదారుల అవసరాలు, అంచనాలను అందుకునేలా ఉంటాయని దాని నిర్వాహకులు చెబుతున్నారు.ఈ విషయాన్ని తాజాగా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో ప్రకటించారు.

ఈ మాల్ అనేక విశేషతలకు నిలయంగా మారనుంది.వినియోగదారుల కోసం అక్కడ అవతార్లు ఉంటాయి.ప్రతి జంక్షన్ వద్ద ఇవి వినియోగదారులను అవి గైడ్ చేస్తూ ఉంటాయి.VOX సినిమాస్, థట్ కాన్సెప్ట్ స్టోర్, ఘవాలి, శామ్సంగ్ స్టోర్ వంటి అనేక రకాల బ్రాండ్లకు సంబంధించిన వస్తువులు అందులో అందుబాటులో ఉంటాయి.
ఈ విషయమై మజీద్ అల్ ఫుట్టయిమ్ అసెట్ మేనేజ్ మెంట్ CEO ఖలీఫా బిన్ బ్రేయిక్ మాట్లాడుతూ… ఈ మాల్ ఆఫ్ ద మెటావర్స్ అనే రిటైల్, ఎంటర్టైన్మెమెంట్ రంగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.ఇంకా అనేక రకాల ప్రపంచ స్థాయి బ్రాండ్ లకు చెందిన ఉత్పత్తులను వినియోగదారులకు అందించే అత్యాధునిక డిజిటల్ ప్లాట్ ఫారమ్ గా ఇది నిలిచి పోతుందన్నారు.







