బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుత కెరియర్ అత్యంత దారుణంగా ఉంది అంటూ స్వయంగా ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలుగు లో కాస్త గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ కి సూపర్ స్టార్ మహేష్ బాబు కి జోడి గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో నటించే అవకాశం దక్కింది, తెలుగు తో పాటు హిందీ లో కూడా ఈ అమ్మడు ఒక సినిమా ను చేస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఆ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న నేపథ్యం లో అక్కడ ఖచ్చితంగా మంచి అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆమె అభిమానులు ధీమా తో ఉన్నారు.

హిందీ లో పూజ హెగ్డే గత చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది, అయినా కూడా ఈ అమ్మడి పట్టుదల ఏ మాత్రం తగ్గలేదు.సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సినిమా తర్వాత కచ్చితం గా హిందీ లో వరుసగా ఆఫర్స్ వస్తాయని ఈమె నమ్మకం వ్యక్తం చేస్తోంది.ఇదే సమయం లో ముద్దుగుమ్మ పూజా హెగ్డే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పై కూడా ఆశలు పెట్టుకొని ఉంది.

ఒకే సారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్డే అక్కడ ఇక్కడ మరిన్ని ఆఫర్స్ రావాలి అంటే ఆ రెండు సినిమాలు సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుంటుంది.మరి ఈ రెండు సినిమాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి.గత సంవత్సరం ఈమె నుండి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.అందుకే ఈ సంవత్సరం పూజా హెగ్డే కి అత్యంత కీలకం.ఈ సంవత్సరం కూడా ఫెయిల్యూర్ తలుపు తడితే పూజ హెగ్డే కెరియర్ ప్రమాదం లో పడ్డట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







