ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మి నారాయణ గట్టి షాక్ ఇచ్చాడు.పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఏపీ బీజేపీలో ప్రకంపనలు రేపాడు.
గత కొన్నాళ్లుగా కన్నా బీజేపీని వీడతారనే వార్తలు వస్తున్నప్పటికి కమలనాథులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.కానీ ఊహించని విధంగా రాజీనామా చేసి బీజేపీ నేతలను డైలమాలోకి నెట్టేశారు.
అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వం నచ్చకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు కన్నా లక్ష్మినారాయణ చెప్పుకొచ్చారు.
గత కొన్నాళ్లుగా ఏపీ బీజేపీలో కన్నా వర్సస్ సోము వీర్రాజు మద్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.
ఇద్దరు కూడా అడపా దడప ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.వీరిద్దరి మద్య ఉన్న విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉండడంతో అధిష్టానం జోక్యం చేసుకొని కలిసి పార్టీ కోసం పని చేయాలంటూ సూచించింది.
అయినప్పటీ అటు కన్నా వర్గం ఇటు సోము వర్గం ఉప్పు నిప్పు లాగే ఉంది.ఇక బీజేపీ పార్టీ కార్యకలాపాలకు గత కొన్ని రోజులుగా కన్నా లక్ష్మినారాయణ దూరంగా ఉంటూ వస్తున్నాడు.
దీంతో కమలనాథులో కూడా కన్నా పార్టీ వీడతారనే డౌట్ ఉంది.అనుకున్నదే అయినట్లుగా కన్నా పార్టీ వీడడంతో గట్టిగానే దెబ్బ పడింది.

అంతేకాకుండా కన్నా లక్ష్మినారాయణ దారిలోనే మరికొంత మంది బీజేపీ నేతలు కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అదే గనుక జరిగితే ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయం.అయితే బిజెపీ నుంచి బయటకు వచ్చిన కన్నా ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారింది.ఆ మద్య జనసేనలో చేరతారని వచ్చినప్పటికి.ప్రస్తుతం ఆయన టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారట.ఎందుకంటే జనసేన ప్రస్తుతం బిజెపీ మిత్రపక్షంగా ఉంది.
ఈ నేపథ్యంలో జనసేన కంటే టిడిపి యే బెటర్ అని భావించిన కన్నా పసుపు కండువా కప్పుకొనున్నారట.ఈ నెల 24న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
ఏపీ బిజెపీకి సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మినారాయణ దూరం కావడంతో కాషాయ పార్టీ మరింత బలహీన పడడం ఖాయం అని రాజకీయవాదులు చెబుతున్నారు.







