టాలీవుడ్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఒకవైపు సోలో హీరోగా సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటిస్తూ సత్తా చాటుతున్నారు.వెంకటేశ్ 75వ మూవీగా సైంధవ్ తెరకెక్కుతుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే విక్టరీ వెంకటేశ్ తన రెమ్యునరేషన్ ను మళ్లీ పెంచేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.వరుస విజయాలతో జోరుమీదున్న వెంకటేశ్ సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సైంధవ్ సినిమా కోసం 17 కోట్ల రూపాయల రేంజ్ లో వెంకటేశ్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ఎఫ్3 సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న వెంకీ మామ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తన రెమ్యునరేషన్ ను మళ్లీ పెంచేశారు.
మరోవైపు వెంకటేశ్ నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చే నెల 10వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సైంధవ్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఓటీటీలో రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.వెంకీ, రానా కాంబోలో తెరకెక్కిన వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

హిట్2 సినిమాతో హిట్ కొట్టిన శైలేష్ కొలను వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.సైంధవ్ సినిమాతో సక్సెస్ సాధిస్తే శైలేష్ కొలనుకు ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.ఈ ఏడాదే సైంధవ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిఅందుకుంటుందో చూడాల్సి ఉంది.







