కెరటం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు జోడి గా నటించింది.
మహేష్ బాబు తో ఒక సారి ఛాన్స్ వచ్చిన సందర్భం లో బిజీగా ఉన్న కారణంగా చేయలేక పోయింది.మళ్లీ కూడా మహేష్ బాబు నుండి అవకాశం రావడం తో ఆయన తో కూడా నటించేసింది.
నాలుగు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్నా రకుల్ ప్రీత్ సింగ్ గత రెండు మూడు సంవత్సరాలుగా పూర్తిగా కనిపించకుండా పోయింది.తెలుగు లో పెద్దగా సినిమాల్లో ఛాన్స్ రావడం లేదు.
హిందీలో అవకాశాలు వస్తున్నా కూడా ఆ సినిమాలు సక్సెస్ కావడం లేదు.దానితో రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ఇబ్బందుల్లో పడ్డట్లయింది.

హిందీ లో గత సంవత్సరం ఐదారు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆమె కు సక్సెస్ తెచ్చి పెట్టలేదు.దాంతో ప్రస్తుతం హిందీ లో కూడా సినిమా లు ఈమె కు లేవు.అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సినిమా ఆఫర్స్ లేక పోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ చాలా డల్ గా సాగుతుంది.
ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ ఓకే చెప్తోంది.కానీ అవి కూడా ఈమెకు దక్కడం లేదని ప్రచారం జరుగుతుంది.మొత్తానికి ఒక్కసారి ఎగసి పడిన కెరటం మాదిరిగా రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ పైకి ఎగసి కింద పడింది.మళ్లీ పైకి లేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో అందాల ఆరబోత తో ఇంకా కూడా యాక్టివ్ గా ఉంది.మరి సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా ఈ అమ్మడు మొదలు పెట్టేనా అనేది చూడాలి.







