ఓరమ్యాక్స్ సర్వే జనవరి నెలకు సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి.ఈ జాబితాలో ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం.
ఓరమ్యాక్స్ సర్వే ప్రతి నెలా హీరోలకు సంబంధించిన సర్వే ఫలితాలను ప్రకటిస్తూ ప్రేక్షకులకు అంతకంతకూ దగ్గరవుతున్న సంగతి తెలిసిందే.ఈ సంస్థ సర్వే ఫలితాల ప్రకారం రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.

ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో, తారక్ సెకండ్ ప్లేస్ లో ఉండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఈ జాబితాలో మూడో స్థానం విషయానికి వస్తే రామ్ చరణ్ ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.చరణ్ కు మూడో స్థానం దక్కడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో కనిపించారు.ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న చిరంజీవి ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలవగా న్యాచురల్ స్టార్ నాని ఎనిమిదో స్థానంలో నిలిచారు.

రవితేజ ఈ జాబితాలో తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకోగా విజయ్ దేవరకొండ ఈ జాబితాలో పదో స్థానంలో నిలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రతి నెలా ఈ సర్వే ఫలితాలలో కొంతమంది హీరోల స్థానాలు మారుతుండగా మరి కొందరు హీరోల స్థానాలు మాత్రం మారడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఓరమ్యాక్స్ సంస్థకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ సంస్థ ఫలితాలు కరెక్ట్ గానే ఉంటాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







