రానురాను పెరిగిపోతున్న పెట్రోల్, డీసెల్ రేట్స్ సగటు మధ్య తరగతి వాడికి గుదిబండగా మారుతున్నాయి.ఈ క్రమంలో చాలామంది వాహనదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లుతున్నారు.
అయితే ఇవి కూడా సాధారణ వాహనాల మాదిరి ఖరీదుతో కూడుకున్నవి కావడంతో కొంతమంది కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.అయితే ఇపుడు బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకునేవారికి శుభవార్త.
తక్కువ రేటులో ఏ ఏ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్కెట్లో మనకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ ముందుగా మనం “ఎవాన్ ఇ ప్లస్” గురించి మాట్లాడుకోవాలి.దీని ధర కేవలం రూ.25 వేలు మాత్రమే.ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే ఇది 50 కిలోమీటర్లు మేర వెళ్తుంది.
కాగా దీని స్పీడ్ గంటకు 24 కిలోమీటర్లు.ఈ లిస్టులో రెండవది “డెటెల్ ఈజీ ప్లస్.” దీని ధర రూ.40 వేల రూపాయిలు.దీని రేంజ్ 60 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.అలాగే మూడవది “యాంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్” దీని ధర రూ.44,500 కాగా ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 కిలోమీటర్లు వెళ్లొచ్చు.దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.

ఈ లిస్టులో నాల్గవది “హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎఫ్2”. దీని ధర రూ.52,500.ఒకే ఒక్క చార్జింగ్ తో ఇది 65 కిలోమీటర్ల మేర వెళ్తుంది.
టాప్ స్పీడ్ కూడా గంటకు 25 కిలోమీటర్లు.ఇక 5వది “లోహియా ఒమా స్టార్ ఎల్ఐ ఎలక్ట్రిక్ స్కూటర్.” దీని ధర కేవలం రూ.41,444 మాత్రమే.ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 కిలోమీటర్లు పక్కా.ఇక ఆరవది “ఒకినవా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్” దీని ధర రూ.67 కాగా ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఇ-స్కూటర్ 60 కిలోమీటర్లు వెళ్తుంది.అలాగే ఒకినవా కంపెనీకు చెందిన ఆర్ 30 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.62,500 కాగా ఒక్కసారి చార్జింగ్ పెడితే 65 కిలోమీటర్లు వెళ్తుంది.కాబట్టి హైస్పీడ్ లేకుండా తక్కువ స్పీడ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలని భావించే వారు ఈ మోడళ్లను ఒకసారి ట్రై చేయొచ్చు.