ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం కారణంగా లక్షలాది మంది తమ ఉపాధిని కోల్పోతున్నారు.ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని చోట్లా లే ఆఫ్‌లు కనిపిస్తున్నాయి.
ఇక అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌లోని వాణిజ్య కేంద్రం మాన్‌హట్టన్‌పైనా దీని ప్రభావం కనిపిస్తోంది.ఆర్ధికం, మీడియా, వినోదం, పర్యాటకం వంటి అన్ని రంగాలు ప్రస్తుతం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
అయితే రిమోట్‌గా పనిచేస్తున్న వారి వల్ల న్యూయార్క్ నగరంలోని వ్యాపారాలు కుదేలయ్యాయని పలు నివేదికలు చెబుతున్నాయి.స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్ధికవేత్త నికోలస్ బ్లూమ్స్ .ప్రకారం మాన్‌హట్టన్‌లోకి వచ్చే కార్మికులు కోవిడ్‌కు ముందు సంవత్సరం కంటే 12.4 బిలియన్లు తక్కువగా ఖర్చు చేస్తున్నారట.

కోవిడ్ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత రిమోట్ వర్సెస్ ఇన్ ఆఫీస్ గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.ఇంటి నుంచి పనిచేసే వ్యక్తులు మరింత ఉత్పాదకతతో వున్నారని, వృత్తిగతంగా, వ్యక్తిగతంగా మెరుగైన సమతుల్యతను కలిగి వున్నారని నివేదిక పేర్కొంది.కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటంతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉద్యోగులకు వీలు కలుగుతోందని నివేదికలు చెబుతున్నాయి.అయితే ఇది నాణేనికి మరో వైపు మాత్రమే.
పర్యాటకులు, ప్రజల తాకిడి తగ్గడంతో మాన్‌హాట్టన్ వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.రెస్టారెంట్లు, బార్‌లు, క్లబ్‌లు, జిమ్‌లు, నెయిల్ సెలూన్‌లు, రిటైల్ షాపింగ్ స్టోర్‌లు, బ్రాడ్ వేలు, స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్ కన్సర్ట్‌లపై డబ్ల్యూఎఫ్‌హెచ్ ప్రభావం చూపుతోంది.

ది పార్ట్‌నర్‌షిప్ ఫర్ న్యూయార్క్ సిటీ.సంస్థ ప్రకారం.2023 చివరి నాటికి మాన్‌హట్టన్‌లోని కార్యాలయ సిబ్బందిలో 50 శాతానికి పైగా ఆఫీసుల్లోనే వున్నారు.సెప్టెంబర్ 2022లో ఇది 49 శాతం పెరిగింది.
ఇక పది శాతానికంటే తక్కువ మంది ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసుల్లో వుంటున్నారు.ఇక రిమోట్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్న వారి సంఖ్య సెప్టెంబర్ 2022లో 16 శాతం వుండగా.
అది ఈ ఏడాది జనవరి నాటికి 10 శాతానికి పడిపోయింది.







