అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు వింటేనే అధికారులు హడలిపోతున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తున్నారన్న సమాచారంతో తాడిపత్రిలోని మైనింగ్ శాఖ అధికారులు కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారని సమాచారం.
బయటకు వెళ్లిన గనుల శాఖ అధికారులను జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి పిలిపించారు.అయితే పెద్దపప్పూరులో అక్రమ మైనింగ్ జరుగుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి బాధ్యులపై 24 గంటలలో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో మైనింగ్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.







