వైసీపీ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.ఈ మేరకు అమరావతిలో అసెంబ్లీ ఉంటుందని తెలిపారు.
కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని సజ్జల వెల్లడించారు.రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు.
ఎన్నికల కోసం రాజకీయాలు చేయబోమని పేర్కొన్నారు.ఎలక్షన్స్ కు ముందు ఒకటి తర్వాత ఒకటి మాట్లాడమన్నారు.
అదేవిధంగా చంద్రబాబులా ఘోర తప్పిదాలు చేయమని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా లక్షల కోట్లు సంపాదించుకోమని తెలిపారు.రాజధానులపై కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
బుగ్గన ఏం సందర్భంలో అన్నారో తెలియదన్న సజ్జల విశాఖకు రాజధాని వస్తే టీడీపీకి బాధ ఎందుకని ప్రశ్నించారు.