తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ పెరుగుతోంది.ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఈ జిల్లాలో రాజకీయంగా హేమహేమీలే ఉన్నారు.ఎవరికివారు తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో ఉంటున్నాను .బి ఆర్ ఎస్ లో ఆయన ఇమడలేక పోతున్నారు.
కేసీఆర్ తోనూ ఆయనకి గ్యాప్ వచ్చింది. త్వరలోనే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.తాను ఏ పార్టీలో చేరినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు పెద్ద ఎత్తున టిక్కెట్లు ఇప్పించుకుని తన సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
అలాగే ఖమ్మం, లేదా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంగా భారీ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో భారీ సభను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి .ఈ మేరకు వైరా నియోజకవర్గ కేంద్రంగా అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాన్ని శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నారు.ఏర్పాట్లు అన్నిటిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ దయాకర్ రెడ్డి , రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,

మున్సిపల్ చైర్మన్ జయపాల్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.ఈ సభకు భారీగా పొంగులేటి అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.ఈ సభను భారీగా నిర్వహించి సక్సెస్ చేయడం ద్వారా తన సత్తా చాటుకోవాలని , అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు తన వర్గం వారు అంతా విజయం సాధించేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయని శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నారట.







