సోషల్ మీడియా అంటేనే వైరల్ వీడియోలకు అడ్డా.ఇక్కడ ప్రతిరోజూ అనేకరకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.
అందులో కొన్ని మాత్రమే నెటిజన్ల మనసుని దోచుకుంటాయి.మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి సంబంధించినవి అయితే చెప్పనక్కర్లేదు.
తాజాగా అలాంటి ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి జనాలకి తగ నచ్చేసింది.బేసిగ్గా రెండు, మూడేళ్ళ వయసు పిల్లలు అల్లరి ఎలావుంటుందో చెప్పాల్సిన పనిలేదు.
వారి చేతికి దొరికిందల్లా విసిరేస్తూ వుంటారు, లేదంటే నోట్లో పెట్టేసికుంటూ వుంటారు.

కానీ కొన్ని సందర్భాల్లో చిన్నారులు చేసే పనులు తెగ నచ్చేస్తాయి.కొంతమంది పిల్లలు పెద్దవాళ్లు చేసే పనులను చూస్తూ వాళ్లని అనుకరించడం మొదలు పెడతారు.తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
IPS ఆఫీసర్ దీపాన్షు కబ్రా తన ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మనసుని దోచుకుంది.అవును, వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి గమనిస్తే… ఓ మహిళ వాహనం నుంచి నీళ్ల డబ్బాలను కిందకు దించుతుండగా.
ఆమె కొడుకు బుడిబుడి నడకలు వేసుకుంటూ ఆ డబ్బాలను ఒక్కొక్కటిగా లోపలికి మోస్తూ వెళ్లడం గమనించవచ్చు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కాగా లక్షల మంది దానిని చూస్తున్నారు.అంతేకాకుండా చూసినవారు ఖచ్చితంగా లైక్ చేసే బయటకి వెళ్తున్నారు.ఇక ఆ బుడతడి తపనను మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.‘బుడ్డోడా మమ్మీకి సాయం చేస్తున్నావా?’ అని ఒకరు కామెంట్ చేస్తే… ‘ఇలాంటి చిన్నారి మీ ఇంట్లో ఉంటే చెప్పండి?’ అని కొందరు, ‘ఐ లవ్ యు’ ఓ లేడీ యూజర్ కామెంట్ చేసారు.ఇంకెందుకాలస్యం వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.







