ఏపీలో సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరిగింది.పాఠశాలల ఆవరణలో సచివాలయాల నిర్మాణాలకు నరేగా నిధుల వినియోగంపై న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ మేరకు కేంద్రం అనుమతితోనే వినియోగించారా అని కోర్టు అడిగింది.రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.







